జగిత్యాలలో రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) వేడుకలు సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్దకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ జెడ్పి చైర్పర్సన్ దావసంత సురేష్ చేరుకొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.