ఉత్తరప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించారు. ఈ ఘటన ఫరూఖాబాద్‌లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. భన్వర్ సింగ్ రెండేళ్ల క్రితం వైష్ణవితో వివాహం జరిగింది. వివాహ బంధం బాగానే సాగుతుండగా, కొన్ని రోజుల తర్వాత వైష్ణవి వేరొకరిని ప్రేమిస్తుందని తెలుసుకున్నాడు. దీంతో భన్వర్ తన భార్యను ఆమె ప్రేమించిన వ్యక్తితో వివాహం జరిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.