జగిత్యాల: దెబ్బతిన్న పంటలు పరిశీలించిన ఎమ్మెల్సీ

55பார்த்தது
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్, గుట్రాజ్ పల్లె, అనంతారం, హైదర్ పల్లె, కండ్ల పల్లి, గుల్లపేట గ్రామాలలో అకాల వర్షాలతో కుప్పకూలిన మొక్క జొన్న పంటను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. రైతులను జరిగిన పంట నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. తహసీల్ధార్ తో ఫోన్ లో మాట్లాడి జగిత్యాల రూరల్ మండలంలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி