బుగ్గారం మండలం చందయ్య పల్లిలో ఆదివారం జరిగిన ఉగాది జాతరలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామిని, గరుత్మంతున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం లక్ష్మణ్ కుమార్ ను ఆలయ కమిటీ వారు, యూత్ ఘనంగా శాలువాలతో సత్కరించారు. ఆలయ, జాతర విశేషాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనాదిగా జరుగుతున్న ఇంత గొప్ప జాతర, ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.