జగిత్యాల రూరల్ మండల పరిధిలోని బాలపెల్లి గ్రామం అంగన్వాడి కేంద్రం టీచర్ అరుగుల కవిత ఆధ్వర్యంలో శుక్రవారం గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. అనంతరం పిల్లలకు బరువులు, ఎత్తులు, జబ్బ కొలతలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి వివరిస్తూ, పోషకాహారం గురించి చిరుధాన్యాలు, ఆకుకూరలు పాలు పండ్ల గూర్చి వాటి యొక్క ప్రాముఖ్యత, పోషక విలువల గూర్చి అవగాహన కల్పించారు.