
జగిత్యాల: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ
జగిత్యాల పట్టణంలోని 8వ వార్డు భవానినగర్ లో రూ 14లక్షలతో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గురువారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగ భూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ మల్లవ్వ, తిరుమలయ్య, వార్డు నాయకులు ఎల్ జీ రమేష్, గోపి, శ్రీనివాస్, భాస్కర్ రావు, మాధవ రెడ్డి, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.