అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతోంది. మరోసారి చైనాపై 104 శాతం నుంచి 125 శాతానికి సుంకాలు పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ సుంకాలకు ప్రతీకారంగా అమెరికా వస్తువులపై చైనా 84 శాతం సుంకాలు విధించింది. దీంతో చైనా సుంకాలకు ప్రతీకారంగా మరోసారి అమెరికా 125 శాతానికి పెంచింది. మిగతా దేశాలపై సుంకాలను 90 రోజులపాటు అమెరికా తాత్కాలిక నిలుపుదల చేసింది.