AP: రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రేపు ఉమ్మడి కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి మేయర్, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు,మున్సిపల్ చైర్ పర్సన్లు, వైస్ ఛైర్మన్‌లు, మండల ప్రెసిడెంట్‌లు హాజరు కానున్నారు.