ఈ నెల 11 నుండి 13 వ తేదీ వరకు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి జయంతి ఉత్సవాల కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో హనుమాన్ జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు, ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ , జిల్లా అదనపు కలెక్టర్ బి. ఎస్. లతతో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.