యూపీలో ఘోరమైన ఘటన జరిగింది. మధుర జిల్లా బృందావన్ కొత్వాలిలోని గౌరా నగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌లకు పాల్పడి అప్పుల్లో మునిగిపోయాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చాలని బెట్టింగ్ నిర్వాహకులు సదరు యువకుడిపై ఒత్తిడి తేవడంతో.. మనస్థాపానికి గురై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.