వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ రౌడీ, సైకో అంటూ టీడీపీ నేతలు మాట్లాడుతున్న వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు గతంలో అనేక హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదని, ఆయనకు చీటర్ అనే బిరుదు సరిపోతుందంటూ వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయని, అయితే పోలీసులు వాటిపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.