అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహారం అధికారులకు సీతక్క ఆదేశాలు
అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ఫుడ్స్ అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు బాలమృతంతో పాటు పలు ఆహార పదార్థాలను అందిస్తున్న నాచారం లో తెలంగాణ ఫుడ్స్ పరిశ్రమను సీతక్క ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాల నాణ్యతను పరిసరాల పరిశుభ్రతను ఆమె పరిశీలించారు. అంగన్వాడీలకు నాణ్యమైన పోషక ఆహారాలను అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.