ఈ మధ్య కాలంలో డిజిటల్ స్క్రీన్స్ పెరిగిపోయాయి. వీలైనంత వరకు ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ల బ్రైట్‌నెస్‌ను తగ్గించి వాడుకోవడం ద్వారా కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సన్‌గ్లాసెస్ వంటివి ధరించడం వల్ల సూర్యకిరణాల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే, కళ్లలో దుమ్మూధూళి చేరకుండా ఉంటాయి. ప్రతిరోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. విటమిన్ ఏ, సీ, ఈ ఉండే ఆహారాలు ముఖ్యంగా క్యారెట్లు, ఆకుకూరలు, చేపలు, బాదం, దానిమ్మ, బొప్పాయి వంటివి కళ్లకు మేలు చేస్తాయి.