యూపీలోని లక్నోలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇన్స్పెక్టర్ జనరల్ సంతోష్ రస్తోగి (ఐపీఎస్) కూతురు అనికా రస్తోగి హాస్టల్ గదిలో శవమై కనిపించింది. రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్శిటీలో చదువుతున్న 19 ఏళ్ల అనికా శనివారం తన హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు మరణించినట్లు ప్రకటించారు. అనికా గుండెపోటు వల్ల చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.