திருச்செங்கோடு - Thiruchengodu

வீடியோஸ்


జోగులాంబ గద్వాల జిల్లా
Mar 16, 2025, 02:03 IST/జడ్చర్ల నియోజకవర్గం
జడ్చర్ల నియోజకవర్గం

మహబూబ్ నగర్: దోపిడీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Mar 16, 2025, 02:03 IST
దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ డి. జానకి వివరాల ప్రకారం. ఈనెల 12న జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట అడ్డా మీదకు కూలీ పని కోసం వచ్చిన వెంకటాపూర్ గ్రామానికి చెందిన అంజమ్మతో పాటు మరో మహిళను పని ఇప్పిస్తామని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నారు. తిరిగి 13న టీడీగుట్ట దగ్గర కూలీ పని కోసం ఎదురుచూస్తున్న మరో మహిళను ఆటోలో కలెక్టరేట్ కు ఎదురుగా ఉన్న అడవిలోకి తీసుకువెళ్లి మెడలో ఉన్న పుస్తెలతాడు, కాళ్ల కడియాలు అపహరించారు. కట్రావత్ భరత్, కామారం నరేష్, సామే శోభలను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.