అర్హులందరికీ ఇల్లు ఇప్పిస్తానని, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా అని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. శనివారం వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం తిప్పుడంపల్లిలో రూ. 5 లక్షల ఎంపీ నిధులతో సీసీ రోడ్డు పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామ చౌరస్తాలో ఎంపీ అరుణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. త్వరలో హైమ్యాక్స్ లైట్స్, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేస్తానన్నారు.