మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ లో రూ. 50లక్షల ఎంపీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఎంపీ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తి అయ్యే నాటికి ప్రపంచంలోనే దేశాన్ని ప్రథమ స్థానంలో ఉంచాలన్నదే మోదీ లక్ష్యం అని అన్నారు. ఎంపీ కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.