వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. అనేక వాహనాలు ధ్వంసం చేశారు. ఓ పోలీసు వాహనాన్ని తగలబెట్టారు. నిరసనకారులు ఆ ప్రాంతంలోని కీలక రహదారిని అడ్డుకోకుండా పోలీసులు వారిని నిర్భదించడంతో పరిస్థితులు దిగజారాయి.