ప్రజా పాలన కాదు, నిర్బంధాల పాలన, నిరంకుశ పాలన అని, విద్యార్థుల అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాం అని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ గురువారం అన్నారు. హెచ్‌సీయూ భూముల జోలికి వెళ్లొద్దు, పర్యావరణాన్ని, యూనివర్సిటీ అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దు అన్నారు. అక్రమంగా అరెస్ట్ అయిన కేయూ విద్యార్థుల నాయకులను సుబేదారి పోలీస్ స్టేషన్ వెళ్లి కలిసారు.