హనుమకొండ జిల్లాలోని అన్ని మండలాల పరిధిలోని 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వారంలోగ ప్రారంభించాలని సోమవారం కలెక్టర్ ప్రావిణ్య సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన రూట్ మ్యాపును తయారుచేసి వెంటనే అందించాలన్నారు.