
కొడవటంచ హుండీ లెక్కింపు
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానము కొడవటంచ బ్రహ్మోత్సవముల సందర్భంగా మంగళవారం భక్తులు సమర్పించిన కానుకల హుండీలను విప్పి లెక్కించగా మొత్తం రూ. 23,83,940 లు మరియు మిశ్రమ బంగారం 34 గ్రాములు, మిశ్రమ వెండి కి 1 -500 గ్రామలు వచ్చినవి. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ పర్యవేక్షకులు నందం కవిత, పరకాల డివిజన్ ఆలయ కార్యనిర్వాహణాధికారి యస్. మహేష్, ఛైర్మన్ ముల్కనూరి బిక్షపతి, ధర్మకర్తలు యం శ్రీధర్, యం. ఓంకార్ పాల్గొన్నారు.