AP: వైసీపీ మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'కూటమి ప్రభుత్వం ఏం చేసినా దాన్ని దాటుకొని ప్రజలు మాకు ఓట్లు వేస్తారన్నారు. తమపై కక్ష పెట్టుకోవద్దని టీడీపీ నాయకులే అంటున్నారు. కానీ ఇది ఇక్కడితో ఆగదు.. గుంటూరు ఇవతల ఉన్న వాళ్ళని ఇంట్లో నుంచి లాగి కొడతాం.. గుంటూరు అవతల ఉన్నవాళ్ళని నరికేస్తాం' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కారుమూరి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.