వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో వివిధ అభివృద్ధి పనులపై నగర మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, కుడా వైస్ చైర్మన్ అశ్విని తానాజీ వాకడే లతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్షించారు.