ఎవరైనా క్రికెట్, ఇతర బెట్టింగ్‌లకు పాల్పడినా, ప్రోత్సహించినా వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మంగళవారం హెచ్చరించారు. యువత బెట్టింగ్‌లపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత అధికంగా క్రికెట్ బెట్టింగ్ యాప్‌ల మోజులో పడి ఆర్థికంగా పూర్తిగా నష్టపోవడంతో పాటు కొన్ని సందర్బాల్లో యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారన్నారు.