యూపీలోని ఉన్నావ్ జిల్లా బంగార్‌మౌలో ఓ పోలీసు వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. హెడ్ కానిస్టేబుల్ దీప్ సింగ్ శారీరక సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నట్లు బాధిత యువతి వాపోయింది. దీప్ సింగ్ తనను లైంగికంగా వేధిస్తున్నప్పుడు సీక్రెట్‌గా బాధితురాలు వీడియో తీసింది. ఆ తర్వాత ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. వేధింపులకు గురి చేస్తున్న పోలీసుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.