మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల స్వాగత ఏర్పాట్లపై అధికారులతో స్మితా సబర్వాల్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పోటీల్లో 120 దేశాలకు చెందిన మోడల్స్ పాల్గొంటారన్నారు. వారు మే 6, 7న హైదరాబాద్‌కు చేరుకుంటారని, దీంతో వారి రాక సందర్భంగా చార్మినార్ వద్ద హెరిటేజ్, వాక్, చౌమొహల్లా ప్యాలెస్‌లో వెల్కమ్ డిన్నర్ ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 400 మంది ప్రతినిధులు, ఫొటోగ్రాఫర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు కూడా పాల్గొంటారు.