గంజాయి కేసుల్లో రవాణాకు పాల్పడే వ్యక్తులను మాత్రమే కాకుండా గంజాయిని అందించేవాడితో పాటు దానిని స్వీకరించే వ్యక్తులను అరెస్టు చేయాల్సి వుంటుందని వరంగల్ సీపీ అధికారులకు పిలుపు నిచ్చారు. శుక్రవారం సాయంత్రం నేర సమీక్షా సమావేశాన్ని వరంగల్ కమీషనరేట్లో నిర్వహించారు. సుధీర్ఘ కాలంగా పెండింగ్లో వున్న కేసులను సమీక్ష జరపడంతో పాటు పెండింగ్ కు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.