హనుమకొండ చింతగట్టు క్యాంప్ సమీపంలో గల పద్మశాలి సంఘ భవానికి 1 కోటి రూపాయలు సాధారణ నిధులతో నిర్మించబోతున్న భవనానికి సోమవారం వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ప్రభాకర్ తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. తొలుత పద్మశాలి సంఘం పెద్దలు, సభ్యులు ఎమ్మెల్యే నాగరాజు కి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.