మహనీయుడు, దేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి ఉత్సవాన్ని హనుమకొండ జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జగ్జీవన్ రామ్ విగ్రహం నెలకొల్పడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.