సినీనటి రేణూదేశాయ్ ఓ పాడ్కాస్ట్లో తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడారు. “రాజకీయాల్లోకి వెళ్లడమనేది నా జాతకంలోనే ఉంది. గతంలో ఓ ఛాన్స్ వచ్చింది. కేవలం పిల్లల పెంపకంకోసమే ఆ అవకాశాన్ని వదులుకున్నా. ఇప్పటికీ అదే అభిప్రాయం. నేను విధిరాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నా" అని పేర్కొన్నారు. పాలిటిక్స్ అంటే ఇష్టమేనా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. 'సామాజికసేవ చేయడంలోనే నాకు 'ఆనందం' అని తెలిపింది.