వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించిన వినతులను వెంటనే పరిష్కరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించారు. ప్రజలు అందించిన వినతులను సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్ సూచించారు.