

హనుమకొండ: విశిష్ట సేవలందించిన వాళ్ళకి ఉగాది పురస్కారాలు
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఉగాది పండగ ను ఘనంగా నిర్వహించారు. పండితులు జగన్ అయ్యగారు పంచాంగ శ్రవణo చేశారు. ఉగాది వేడుక, పంచాగ శ్రవణం, వేద పండితుల ఆశీర్వచనం, షడ్రుచుల ఉగాది పచ్చడి సేవనం, భక్షాలు, ప్రసాదాల వితరణ గావించారు. అనంతరం విశిష్ట సేవలందించిన వాళ్ళని ఉగాది పురస్కారాలతో సత్కరించారు.