ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు చురుగ్గా సాగేలా చూసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మంగళవారం హసన్ పర్తి మండలం పెంబర్తి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో నిర్మాణంలో ఉన్న లబ్ధిదారుల ఇందిరమ్మ ఇండ్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తయ్యేలా చూసుకోవాలన్నారు.