తెలంగాణ సాయుధ పోరాటం తొలి పోరాటయోధుడు దొడ్డి కొమరయ్యను ఆదర్శంగా తీసుకుని జీవన విధానాన్ని అలవర్చుకోవాలని హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి అన్నారు. గురువారం దొడ్డి కొమురయ్య 98వ జయంతిని పురస్కరించుకొని మాట్లాడుతూ భూమికోసం, ముక్తి కోసం విముక్తి ఉద్యమంగా కడవండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించి ఒక మహోన్నత ఉద్యమానికి హాజరు కావడం గర్వకారణమని అన్నారు.