తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు ఏప్రిల్ 10 నుంచి నిర్వహిస్తామని టీటీడీ ప్రకటించింది. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా సాలకట్ల వసంతోత్సవాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఉత్సవాలను టీటీడీ నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాలకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారిని దర్శించుకుంటారు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే తిరుమల.. వసంతోత్సవాల్లో భాగంగా విద్యుద్దీప అలంకరణతో శోభాయమానంగా విరాజిల్లనుంది.