హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఉన్న గార్డెనింగ్ (పార్క్) గాను రాష్ట్ర ఉద్యాన శాఖ ద్వారా 8వ గార్డెన్ ఫెస్టివల్లో ఉత్తమ గార్డెన్ గా అవార్డు వచ్చింది. గోల్డెన్ ట్రోఫీ అదేవిధంగా సర్టిఫికెట్ ప్రధానం చేయడం జరిగింది. దీనిని సోమవారం కలెక్టర్ సంబంధిత అధికారులను అభినందించారు. ఈ ప్రాంగణంలో 114 రకాల పూలు, నీడనిచ్చే మొక్కలను నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడం వలన రాష్ట్ర స్థాయిలో గోల్డెన్ గార్డెన్ అవార్డు వచ్చింది.