
వరంగల్: ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శనివారం రాత్రి పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, ముస్లిం సోదరులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.