వివాహిత ఆత్మహత్య
వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రామకృష్ణాపూర్ ఏ జోన్ లో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ వివరాల ప్రకారం మందమర్రికి చెందిన తేజశ్రీ (33) కి ఏ జోన్ కి చెందిన రాజ్ కుమార్ తో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. గత కొద్దిరోజులుగా అతని కుటుంబ సభ్యుల వేధింపులు ఎక్కువ అవడంతో మనస్థాపం చెంది ఇంటి పైకప్పు దూలానికి ఊరేసుకున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.