పశ్చిమ బెంగాల్లో జరిగిన జూనియర్ మహిళ డాక్టర్ ను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను గుర్తించి ఉరిశిక్ష విధించాలని ఆర్ఎంపీ, పీఎంపీ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ నస్పూర్ కమిటీ అధ్యక్షులు సుంచు శంకర్ వర్మ కోరారు. బాధితురాలు కుటుంబాన్ని ఆదుకుని 50 లక్షల ఎక్స్గ్రేషియా తో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రొడ్డ రాజేశం, రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆడేపు శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి ఎడ్ల శంకర్, ట్రెజరరీ ఈ. రాజు, మహేందర్ రెడ్డి, సుధాకర్, రమేష్, మల్లేశం, పి. రవి బెంజిమెన్, మల్లికార్జున్తదితరులు పాల్గొన్నారు.