ఊర చెరువును కాపాడాలని వినతి
మందమర్రి మున్సిపాలిటీ పరిధి ఊరు మందమర్రి వెళ్లేదారిలో ఊర చెరువు అక్రమాలకు గురై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని బహుజన సమాజ్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఫిర్యాదు చేశారు. చెన్నూర్ నియోజకవర్గ కన్వీనర్ ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చెరువు ఎఫ్ టి ఎల్ గుర్తించి హద్దులు ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరారు.