ఎన్నికల హామీకి కట్టుబడి రైతు రుణమాఫీ చేయాలని ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో జైపూర్ మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్ వెళ్లకుండా నాయకులు రాజశేఖర్, రవి, జగన్, రాజకుమార్, స్వామిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.