వేమనపల్లి: రైతులకు నష్టపరిహారం అందించాలి
వేమనపల్లి: గత జులై, ఆగస్టు నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రాణహిత ఉప్పొంగి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుమాధవ్ బుధవారం తాహశీల్దార్ రమేష్ కు వినతిపత్రం అందించారు. పలు గ్రామాలు పత్తి పంటలు మునిగాయని పేర్కొన్నారు. దీంతో సుమారు రెండు వేల ఎకరాల్లో రైతులు నష్టపోయారని వెల్లడించారు. అయినా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలో విఫలమైందని విమర్శించారు.