ఛత్తీస్‌గఢ్‌లోని బార్సూర్‌లో అద్భుతమైన శివాలయం ఉంది. చారిత్రక నగరం బార్సూర్‌లో ఉన్న ఈ ఆలయాన్ని ‘బత్తీస్ మందిర్’ అని పిలుస్తారు. ఈ ఆలయం 32 స్తంభాలకు ప్రసిద్ధి చెందింది. రెండు గర్భాలయాలు కలిగిన ఏకైక ఆలయం ఇదే. ఇక్కడ శివలింగం 360 డిగ్రీలు తిరుగుతుంది. భక్తులు శివలింగంను తిప్పుతూ కోరుకున్న కోర్కెలను ఆ శివయ్య నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం. రాజమహర్షి గంగామహాదేవి 1208లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది.