
బెల్లంపల్లి: గున్నికుంట చెరువు సర్వే
బెల్లంపల్లి మండలంలోని చాకెపల్లిలో గున్నికుంట చెరువును ఇరిగేషన్ అధికారులు శుక్రవారం సర్వే చేశారు. చెరువును కొంతమంది స్థానికులు కబ్జా చేసిన వ్యవహారంపై ఇరిగేషన్ అధికారులు స్పందించారు. తమకు న్యాయం చేయాలని గ్రామానికి చెందిన ముదిరాజు కులస్తులు ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వారు చెరువు ఎఫ్టిఎల్ లెవల్ వరకు సర్వే జరిపి హద్దులు నిర్ణయించారు.