తాండూర్: సర్వే ప్రకియ సమర్ధవంతంగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని తాండూర్ తహశీల్దార్ ఇమ్రాన్ ఖాన్ పఠాన్ అన్నారు. శనివారం మండలంలోని అచ్చులపూర్ గ్రామంలో కొనసాగుతున్న సర్వేను ఎంపీడీఓ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. సర్వే నిర్వహణలో ఏమైనా అనుమానాలుంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని, సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.