బెల్లంపల్లి: వార్డులో మంచినీటి సరఫరా చేయాలి
మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల బెల్లంపల్లిలో త్రాగునీరు సమస్యతో అల్లాడుతున్నామని 6వ వార్డు ప్రజలు ఆరోపిస్తున్నారు. అడా ప్రాజెక్టు నీరు రాక 4రోజులు గడుస్తున్నాయని బస్తివాసులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే చొరవ తీసుకొని బస్తివాసులకు త్రాగడానికి నీరు అందించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు డిమాండ్ చేశారు.