తమిళనాడులోని తంజావూర్ దగ్గరున్న వళంగైమాన్‌లో మొక్కు తీర్చుకునే తీరు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే మారియమ్మన్ ఆలయానికి వెళ్లిన భక్తులు కోరిన కోరికలు తీరితే పాడెపై ఊరేగి మొక్కు చెల్లిస్తారు. వారు చనిపోయినవారి మాదిరి పాడే కట్టించుకుని ఊరంతా ఊరేగిన తరవాత ఆలయానికి చేరుకుంటారు. అక్కడికి వెళ్లాక పూజారి తులసి తీర్థం చల్లాక మొక్కు తీరిపోతుంది. ఇలా చేయడం వల్ల మారియమ్మన్ ఆయురారోగ్యాలనీ అష్టైశ్వర్యాలనీ ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం.