ఆలయంలో కుప్పకూలిన భక్తుడు
వేములవాడ రాజన్న గుడిలో ఫిట్స్ వచ్చి వరంగల్ కు చెందిన భక్తుడు కుప్పకూలిపోయాడు. దీంతో భక్తుడికి తోటి భక్తులే సహాయం అందించి ఆస్పత్రికి తరలించారు. అందుబాటులో ఆరోగ్య కేంద్రం, వైద్య సిబ్బంది గానీ లేకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలోనూ కదలని ఆలయ అంబులెన్స్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జరగరానిది జరిగితే బాద్యులు ఎవరంటూ భక్తులు మండిపడుతున్నారు.