YELLOW ALERT: వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు

82பார்த்தது
YELLOW ALERT: వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దీంతో తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

தொடர்புடைய செய்தி