కేజీబీవీ లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. సోమవారం ధర్మసాగర్ మండలం ముప్పారం పరిధిలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించారు. పాఠశాలలోని తరగతి గదులు, పాఠశాల మైదానం, వంటగది, స్టోర్ రూమ్, మెడికల్ రూమ్ ను పరిశీలించారు. వివిధ తరగతుల విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు.